కుప్పం (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న పేద మహిళకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం అత్తినతం గ్రామంలో సాలమ్మ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటంతో సహాయం చేయాలని సోనూసూద్ ఫౌండేషన్ ని ఆశ్రయించారు. గుడుపల్లి మండలానికి చెందిన సోనూసూద్ ఫాండేషన్ సభ్యుడు పురుషోత్తం చొరవ తీసుకుని విషయాన్ని సోనూసూద్ కి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆయన వైద్య పరికరాలు సమకూర్చారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న తమ విషయం తెలిసి సహాయం అందించిన సోనూసూద్ కి, వారి ఫౌండేషన్ సభ్యులకు సాలమ్మ కృతజ్ఞతలు తెలిపారు.