మున్సిపల్ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి

UPDATED 30th APRIL 2018 MONDAY 6:30 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పాఠశాలలకు అభివృద్ధికి విశేష కృషి చేస్తూ అనేక సదుపాయాలు కల్పిస్తోందని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన విద్యా విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పట్టణ పరిధిలో గల మున్సిపల్ పాఠశాలల్లో  అంకితభావం గల ఉపాధ్యాయుల కృషి వల్ల పదవతరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రముఖ గణితావధాని తోటకూర సాయి రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో గల నాలుగు ఉన్నత పాఠశాలల్లో బచ్చు ఫౌండేషన్ ఉన్నత పాఠశాల నూరుశాతం ఫలితాలతో ప్రథమ స్థానంతో పాటు ఒక విద్యార్థికి 10 జిపిఎ, యార్లగడ్డ అక్కిరాజు ఉన్నత పాఠశాల 98 శాతం ఉత్తీర్ణతతో ఇద్దరు విద్యార్థులకు 10 జిపిఎ,  బి.బి.ఆర్ ఉన్నత పాఠశాల నూరుశాతం ఉత్తీర్ణతతో 9.8 జిపిఎ, తోట గోపాలకృష్ణ ఉన్నత పాఠశాల 95 శాతం ఉత్తీర్ణతతో 9.3 జిపిఎ సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ, యు. సత్యనారాయణ, ఆర్. శ్రీనివాసరాజు, టి.శ్యామ్ సుందర్ లను పూలమాలలతో, దుశ్శాలువాలతో మున్సిపల్ కమీషనర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె.డబ్యు. జయకర్, ప్రజా సామాజిక వేత్త సుంకవల్లి బాపిరాజు, పిఇటి టి. వైకుంఠం, కోడూరి శివప్రసాద్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
,
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us