ఇంజనీరింగ్‌ చేసినా, సినిమాలపై ఇష్టంతోనే వచ్చా

హీరోయిన్ రీతూ వర్మ

అమలాపురం (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: తాను ఇంజనీరింగ్‌ పూర్తిచేసినా సినిమాలపై ఇష్టం, అభిమానంతోనే నటనలోకి వచ్చానని సినీ హీరోయిన్‌ రీతూవర్మ పేర్కొన్నారు. ‘పెళ్లిచూపులు’ చిత్రంలో చిత్ర పాత్ర అందరి ప్రశంసలు అందుకుని, మంచి గుర్తింపును తీసుకువచ్చిందన్నారు. అమలాపురంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు. అనుకోకుండా.. షార్ట్‌ఫిల్మ్‌లో నటించగా కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, నిన్నిలా నిన్నిలా, టక్‌ జగదీష్‌ చిత్రాల్లో మంచి గుర్తింపు వచ్చిందని, ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తీస్తున్న చిత్రం లో హీరోయిన్‌గా నటించడంతోపాటు తమిళంలో మరో రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించేందుకు అంగీక రించినట్టు చెప్పారు. సీఎంఆర్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us