బాహుబలి2 వెయ్యి కోట్ల పోస్టర్ విడుదల..

UPDATED 7TH MAY 2017 SUNDAY 2:00 PM

REDBEENEWS: బాహుబ‌లి చ‌రిత్ర సృష్టించింది. సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ తెలుగు సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి యావత్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. సంచ‌ల‌నాల బాహుబ‌లి 2 ఊహించిన‌ట్లే వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల మార్క్ దాటింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ భార‌తీయ సినిమా ఈ మార్క్‌ను అందుకోలేదు. బాహుబలి2 చిత్రం నిన్నటి వరకు 900 కోట్ల రూపాయలని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ రోజు ఆదివారం, హాలీడే కావడంతో ఈ సినిమా థియేటర్స్ అన్ని హౌజ్ ఫుల్ అయ్యాయి. దీంతో బాహుబలి 2 చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ని ఈజీగా దాటింది. ఈ విషయాన్ని బాహుబలి టీం కూడా అఫీషియల్ గా ప్రకటించింది. గతంలో ఏ భారతీయ చిత్రం కూడా ఈ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోపోగా, బాహుబలి2 చిత్రం అవలీలగా ఈ రికార్డుని చెరిపేసింది. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు కూడా కాలేదు, కాని వసూళ్ళు మాత్రం సునామిని సృష్టిస్తున్నాయి. రానున్న రోజుల్లో బాహుబలి 2 మరిన్ని రికార్డులని తన ఖాతాలో వేసుకోనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభాస్ తన అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇండియాలో, ఫారిన్ లో తనపై చూపిస్తున్న ప్రేమకి థ్యాంక్స్ అని చెప్పిన ప్రభాస్, రాజమౌళి ఏదైతే తన విజన్ అని నమ్మాడో అది నేను మోయగలనని, దాన్ని మాస్ ప్రేక్షకులకు కూడా చేర్చగలననే నమ్మకంతో జీవితంలో మర్చిపోలేని బాహుబలి పాత్రను ఇచ్చినందకు ధన్యవాదాలు అని పోస్ట్ పెట్టాడు యంగ్ రెబల్ స్టార్. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us