చేనేత బీమా సహాయం పెంచాలి

Updated 21st April 2017 Friday 11:30 AM

పెద్దాపురం: చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ బునకర్ బీమా యోజనా పధకం సహాయాన్ని రూ. 60  వేల నుంచి రూ. లక్షకు పెంచాలని ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు అన్నారు. స్థానిక మెయిన్ రోడ్ లో ఉన్న చేనేత సొసైటీ కార్యాలయం లో సొసైటీ మేనేజర్ తూతిక చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఆయన శుక్రవారం  మాట్లాడారు. ఈ పధకం ద్వారా 59  సంవత్సరాలలోపు  వయసులో మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు మాత్రమే రూ. 70  వేలు సహాయం గా అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఆయుప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో 59  సంవత్సరాల నుంచి 70  సంవత్సరాలకు పెంచడంతో పాటు సహాయం రూ. లక్షకు పెంచాలన్నారు. మరణించిన ఎక్కువ మంది చేనేత కార్మికులు మరణించేనాటికి 59 కంటే ఎక్కువ వయసు కలిగి ఉండడంతో ఈ పథకం అమలుకావడం లేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆప్కో సంస్థ వయసుతో సంబంధం లేకుండా ఏ వయసులో మరణించినా చేనేత కార్మికుడి కుటుంబానికి రూ. 12500 ఇన్సూరెన్స్ పధకం ద్వారా సహాయం అందిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఇటీవల మరణించిన  చేనేత కార్మికుడు కాకర్ల భీమరాజు భార్య పార్వతికి చెక్కు ను  అందచేశారు. ఈ కార్యక్రమం లో కార్యాలయ సిబ్బంది శేఖర్ తదితరులు పాల్గొన్నారు.             

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us