తెలుగుజాతికి ఆదర్శప్రాయుడు ఎన్టీఆర్

 

* పెద్దాపురం ఎంఎల్ఏ విజేత నిమ్మకాయల చినరాజప్ప 
* ఘనంగా జయంతి వేడుకలు

UPDATED 28th MAY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు తెలుగు జాతికి ఆదర్శప్రాయుడని, జాతి కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన మహోన్నత వ్యక్తి అని పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ విజేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మఠం సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఎన్టీఆర్ విగ్రహానికి చినరాజప్ప పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1982వ సంవత్సరంలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ముఖ్యమంత్రిగా బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు, ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత ఎన్‌టీ రామారావుకే దక్కుతుందని, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదలకు సంక్షేమ ఫలాలను అందించిందన్నారు. ఆయన ఆశయ సాధనకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఆయనకు ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ఏఎంసి వైస్ చైర్మన్ చిట్టిబాబు, బడుగు శ్రీకాంత్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us