అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల వారసులకు త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఆర్టీసీ హౌస్‌లో శనివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగం నుంచి వివిధ కారణాలతో వైదొలగిన వారికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన సూచించారు. కొత్త ఏడాదిలో సంస్థలో వ్యయాన్ని నియంత్రించి..ఆదాయం పెంచడంపై ఉద్యోగులు దృష్టి పెట్టాలన్నారు. పొరుగు రాష్ట్రాల రవాణా సంస్థలతో పోటీ పడి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఎండీ సూచించారు.