Updated 27 January 2022 Thursday 05:30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ను ఎవరు గౌరవించినా తాము స్వాగతిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని, ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొలగించారని విమర్శించారు. కడప జిల్లాకు వైఎస్ పేరు పెట్టినా తాము వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. టీడీపీకి ద్వంద్వ విధానాలు ఉండవని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని తప్పుబట్టారు. ఎన్టీఆర్ స్మృతి వనం ప్రాజెక్ట్ను నిలిపివేసిన జగన్రెడ్డి ప్రభుత్వం.. ఎన్టీఆర్పై ప్రేముందని చెప్పే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు.