UPDATED 5th APRIL 2022 TUESDAY 08:30 PM
Bride suicide : కర్నూలు జిల్లాలో నవ వధువు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురంలో రేణుకమ్మ అనే వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న రేణుక గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది.రెండు నెలల క్రితం వీరేశ్ అనే వ్యక్తితో రేణుకకు వివాహం జరిగింది. భర్త, అత్త మామలే ఆమెను చంపి ఉంటారని రేణుక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.