పంట కాల్వలో ప్రైవేట్ బస్సు బోల్తా

UPDATED 8th DECEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: శబరిమల యాత్ర ముగించుకుని స్వగ్రామం తిరిగి వస్తుండుగా పంటకాలువలో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన సంఘటన సామర్లకోట-పిఠాపురం రోడ్డులో చోటుచేసుకుంది. పిఠాపురం మండలం బి. ప్రత్తిపాడుకు చెందిన అయ్యప్ప భక్తులు యాత్ర ముగించుకుని ప్రైవేటు బస్సులో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా శనివారం తెల్లవారుజామున రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి పంట కాలువలోకి దూసుకుపోయింది. బస్సులో సుమారు 40 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. వారిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవరును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాసనాయక్ తెలిపారు.  

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us