సెంట్రల్‌ జోన్‌ కబడ్డీ పోటీలో కిట్స్

దివిలి (పెద్దాపురం) : జేఎన్‌టీయూకె యూనివర్శిటిి సెంట్రల్‌ జోన్‌ కబడ్డి పోటీలలో దివిలి కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్దులు తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల చైర్మన్‌ బేతినీడి శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు కళాశాల క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్‌టీయూకె పరిధిలో సుమారు 270 కళాశాలలు ఉన్నాయని జోన్‌ బి పరిధిలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కళాశాలల విద్యార్థులు ఈకబాడీ పోటీల్లో పాల్గొన్నాయన్నారు. జోన్‌బిలో కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచి సెంటల్ర్‌ జోన్‌ పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 10,11,12 తేదిలలో విశాఖపట్టణం రఘు ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన యూనిర్శిటి సెంటల్ర్‌ జోన్‌ కబడ్డీ ఫైనల్స్‌లో శ్రీకాకుళం శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాలపై విజయం సాధించి జేఎన్‌టీయూకె యూనివర్శిటి విన్నర్స్‌గా నిలిచారన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్దులను, పీడీ రవికుమార్‌ను చైర్మన్‌ శ్రీనివాసరావు ఆయన అభినందించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా.శర్మ, ఏవో కేఆర్‌ సందీప్‌, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, అప్పారావు మాస్టారు, హెచ్‌వోడిలు, సిబ్బంది అభినందించారు.


 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us