విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

UPDATED 13th AUGUST 2018 MONDAY 9:30 PM 

సామర్లకోట: స్థానిక ఆరవ వార్డులోని శారదాదేవి మున్సిపల్ ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు సోమవారం పంపిణీ చేశారు. కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కార్మిక నాయకుడు దవులూరి సుబ్బారావు, ఎంఈవో వై.వి. శివరామకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మోజెస్ మాట్లాడుతూ వార్డులో ఉన్న పాఠశాలలను దాతల సహకారంతో కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో పాఠశాల స్లాబు నుంచి నీరు లీకవుతోందని మరమ్మతులు చేయాలని దాత సుబ్బారావు దృష్టికి కౌన్సిలర్ తీసుకురాగా వెంటనే ఆయన స్పందించి మరమ్మతులకు రూ. 30 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి, లయన్స్ క్లబ్ జోనల్ ప్రతినిధి చిత్తులూరి వీర్రాజు, పాఠశాల హెచ్ఎం సంజీవరావు, ప్రతిభా పాఠశాల ప్రిన్సిపాల్ రవి, మాజీ సర్పంచ్ చక్రవర్తి, ఉపాధ్యాయులు, విద్యార్దులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us