ఆదిత్యలో సినీ హీరో సుమన్ హల్ చల్

UPDATED 2nd MARCH 2018 FRIDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ప్రముఖ సినీ నటుడు సుమన్ శుక్రవారం సందడి చేశారు. క్యాంపస్ కు విచ్చేసిన ఆయనకు కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డిని కలుసుకుని అనంతరం క్యాంపస్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే జె.ఎన్.టి.యు.కె. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కు హాజరై బాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. ఈ నెల ఎనిమిదవ తేదీన క్యాంపస్ లో ప్రతిష్టించనున్న శ్రీ షిరిడీ సాయి, సరస్వతీదేవి ఆలయాలను సందర్శించి అనంతరం విద్యార్డులతో సెల్ఫీలు దిగారు.          

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us