Vundavalli: పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళన.. ఉండవల్లి ఏమన్నారంటే..

Updated 24 January 2022 Monday 17:00 PM

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో పీఆర్సీ అంశం.. ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఇప్పటివరకు జీతాలు పెంచాలని సమ్మెలు చూశామని.. కానీ పెంచిన జీతాలు వద్దంటూ సమ్మె నోటీసుకు సిద్ధమవడం ఇదే ప్రథమమని ఆయన చెప్పారు. పాత జీతాలే కావాలంటూ సమ్మె చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు. కరోనా పరిస్థితులు, ఆర్థిక దుస్థితి దృష్ట్యా సమ్మె ఆపాలని ఉద్యోగులను ఉండవల్లి కోరారు. ప్రభుత్వం, ఉద్యోగులు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us