ఇద్దరు అంతర్ జిల్లా ముద్దాయిలు అరెస్ట్

UPDATED 4th MAY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వద్ద ఇద్దరు అంతర్ జిల్లా ముద్దాయిలు అరెస్ట్ చేశారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలోను మోటారు సైకిల్ తో పాటు డిక్కీలో పెట్టుకొన్న రూ.10వేల నగదు చోరీ చేశారన్న నేరంపై గుంటూరు జిల్లా స్టువర్టుపురానికి చెందిన గోదావరి దిలీప్ కుమార్, మెండుగుత్తి లాజర్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు సామర్లకోట పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.1.90 లక్షల విలువైన మోటార్ సైకిళ్లు, నగదు స్వాధీనం చేసుకొన్నామని వీరిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ వై.ఆర్.కె..శ్రీనివాస్, క్రైమ్ ఎస్సై సూర్యనారాయణ, సామర్లకోట ఎస్సై శ్రీనివాస్ నాయక్,  ఏఎస్సై కె. లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ గుబ్బల సత్యనారాయణమూర్తి, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ బలరాం, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us