అర్హులందరికీ పింఛన్లు పంపిణి

UPDATED 8th APRIL 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: అర్హత గల వృద్ధులకు పింఛన్లు అందచేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక నీలమ్మ చెరువు వద్ద పట్టణ, మండల పరిధిలోని గ్రామాలలలో కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత గల ప్రతీ వృద్ధునికి పింఛన్లు అందచేయడానికి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. సామర్లకోట పట్టణానికి 450, అలాగే మండలంలోని 18 గ్రామాలకు కొత్తగా 544 పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. పట్టణంలో 5406 మందికి, మండలంలో 7878 మందికి పించన్లు అందచేస్తున్నామని, వీటికి నెలకు రూ. ఒక కోటి 47 లక్షల 59 వేలు ప్రతీ నెల 5వ తేదీలోగా అందచేస్తున్నామని చెప్పారు. పింఛన్లు వృద్దులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని, ఇంకా అర్హత కలిగి రానివారికి కూడ త్వరలో పింఛన్లు, తెల్లరేషన్ కార్డులు అందచేస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి వారికి అనేక సంక్షేమ పథకాలు అందచేస్తునట్లు చెప్పారు. చంద్రన్నభీమా పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ. 2లక్షలు అందచేస్తున్నామని తెలిపారు. నిరుపేదలైన వారి పిల్లల వివాహం నిమిత్తం ఉగాది నుంచి కళ్యాణ కానుకగా ఎస్.సికి రూ.40వేలు, బి.సికి రూ. 35 వేలు, ఎస్.టికి రూ. 50 వేలు, మైనార్టీలకు రూ. 50 వేలు పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్ళు లేని వారికి గృహాలను మంజూరు చేస్తున్నామని, రూరల్ లో సొంత స్థలాల్లో ఇళ్ళు నిర్మాణానికి రూ. లక్షా 50 వేలు అందచేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, లైన్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా డబుల్ రోడ్డు ఏర్పాటుకు రూ.35 కోట్లు, సెంట్రల్ లైటింగు, మొక్కలు ఏర్పాటుకు రూ. 5 కోట్లు కేటాయించామని చెప్పారు. పట్టణంలో చెఱువులను మున్సిపాల్టీ నిధులతో ఆహ్లాదకరంగా పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ. 4 కోట్లు ఎస్.సి నిధులతో ఎస్.సి కాలనీలో రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నామని, అలాగే 30 కోట్లు ఆర్ అండ్ బి నిధులతో రోడ్డు అభివృద్ధిలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలు ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని,.రూ. 2.5కోట్లుతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని, నిరుద్యోగ యువతకు స్కిల్స్ డవలప్ మెంట్ ఇస్తున్నామని, తద్వారా జాబ్ మేళాలు నిర్వహించి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సామర్లకోట మున్సిపాల్టీ పరిశుభ్రతకు భారత ప్రభుత్వం అవార్డును ఇవ్వడం హర్షణీయమని, ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమీషనర్, సిబ్బందిని మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి పించనుదారులకు రూ.1000 నగదును అందచేశారు. స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డును మంత్రి చేతుల మీదుగా కౌన్సిలర్లు, కమీషనర్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలోని అర్.టి.సి బస్సు కాంప్లెక్సు వద్ద పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి  ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.టి.సి గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఏఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, ఏఎంసి వైస్ చైర్మన్ చిట్టిబాబు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చైర్మన్ అడబాల కుమారస్వామి, డాక్టర్ అనంత పద్మనాభం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, మన్యం చంద్రరావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, డి.ఎస్.పి ఎం. రాజశేఖర్ రావు, సిఐ  ప్రసన్న వీరయ్య గౌడ్, అడిషనల్ ఎస్.ఐ విజయలక్ష్మి, తోటకూర శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, తహశీల్దార్ ఎల్. శివకుమార్, ఎంపిడివో జగ్గారావు, కౌన్సిలర్లు, సర్పంచులు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us