ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో గెస్ట్ లెక్చర్

UPDATED 20th JUNE 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెంలోని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఫైబర్ రీ ఇన్ ఫోర్స్ పాలిమర్ కాంపోజిట్స్ ఇన్ నానోస్కిల్ అంశంపై బుధవారం గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రాయూనివర్సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వి.వి.ఎస్. ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పరిశోధనా అంశాలపై అవగాహన కలుగజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని, విద్యార్థులు, పరిశోధనలకు అందుబాటులో ఉన్న విప్లవాత్మక, ఉద్భవిస్తున్న నూతన పరిజ్ఞానాన్ని తెలియచేస్తుందని అన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ మెకానికల్ విభాగంలో మైక్రో&నానో పరిమాణాల్లో వస్తు ప్రభావ ప్రవర్తన, వాటి అప్లికేషన్స్, నూతన విషయాలు తెలుసుకోవడానికి, పేపర్ పబ్లికేషన్స్, నైపుణ్యాలు విస్తరించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశంలోని ప్రతీ ఒక్క ఇంజనీరింగ్ విద్యార్ధి నూతన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్ & డి పి.వి.యస్. మాచిరాజు, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ పి.కుమార్ బాబు, అసోసియేట్ ప్రొఫెసర్ పి.సుకుమార్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us