కాకినాడ మేయర్‌గా శివ ప్రసన్న ఎన్నిక

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 25 ఆక్టోబర్ 2021: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా సుంకర శివ ప్రసన్న, డిప్యూటీ మేయర్-1గా మీసాల ఉదయ్ కుమార్‌ ఎన్నికయ్యారు. వీరి పేర్లను ప్రిసైడింగ్ అధికారి, తూర్పు గోదావరి జిల్లా జేసీ లక్ష్మీశ ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్-1 ఎన్నిక కోసం నగర పాలక సంస్థ ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్‌గా ఎన్నికైన శివ ప్రసన్న తెదేపా తరఫున 40వ డివిజన్‌ నుంచి గెలిచి వైకాపాలో చేరారు. ఇటీవల కాలం వరకు మేయర్‌గా ఉన్న తెదేపా కార్పొరేటర్‌ సుంకర పావని అవిశ్వాసం కారణంగా తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us