Tollywood: టాలీవుడ్ ప్రముఖుల కోసం.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు

UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 10:40 AM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరలు, థియేటర్లకు సంబంధించిన సమస్యలకు ఎట్టకేలకు స్పష్టత రాబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ముఖ్యమైన భేటికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్ కూడా వెళ్లనున్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలు, టికెట్ ధరల విషయంపై ఈ సమావేశం జరగబోతుంది. సీఎంతో సమావేశానికి వెళ్లడానికి తాడేపల్లి వస్తున్న సీనిప్రముఖుల కోసం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. సీఎంని కలిసేందుకు వస్తున్న సినీ పెద్దలకు ట్రాఫిక్ క్లియరెన్స్ ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇప్పటికే నిడమానూరు ఎనికేపాడు ప్రసాదంపాడు రామవరప్పాడు బెంజ్ సర్కిల్ వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు.

మార్గ మధ్యలో ప్రధాన కూడళ్ళలో సినీ ప్రముఖులను చూసేందుకు అభిమానులు వస్తుంటే కట్టడి చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. సినీ ప్రముఖులు వస్తున్న సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు పోలీసులు. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఓ దఫా సమావేశమయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో నాగార్జున, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ వంటి పెద్దలు ముఖ్యమంత్రి జగన్‌ను కలవబోతున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి ప్రత్యేక విమానంలో వెళ్తుండగా.. ఇప్పటికే నటుడు ఆర్ నారాయణ మూర్తి, అలీ, పోసాని కృష్ణమురళీ విజయవాడ చేరుకున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us