లియో స్పెల్బీ లో శ్రీ ప్రకాష్ ప్రతిభ

పెద్దాపురం: జె ఎన్ టి యు కె  ఆధ్వర్యం లో ఇటీవల నిర్వహించిన లియో స్పెల్ బీ లో పెద్దాపురం శ్రీప్రకాష్ విద్యార్థులు విశేష  ప్రతిభ  కనబరిచినట్లు పాఠశాల డైరెక్టర్ సి హెచ్ విజయ ప్రకాష్ తెలిపారు. జిల్లా లో పలు పాఠశాలల  నుంచి   సుమారు 1500  వందల మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. తమ పాఠశాల కు చెందిన విద్యార్థులు గ్రీష్మశ్రీ, మనోజ్ కుమార్, ప్రణవ్, రాజేష్, నాగేంద్ర వంశీ వివేక్ లు ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. మొదటి పది స్థానాలలో తమ పాఠశాల కు చెందిన విద్యార్థులు ఐదుగురు ముందు నిలిచారన్నారు. గెలు పొందిన విద్యార్థులకు పారితోషకం తో పాటు ట్రోఫీ కైవసం చేసుకున్నారని తెలిపారు. విజేతలను షీల్డ్ , బంగారు పథకాలు తో సత్కరించారు. విజేతలను పాఠశాల డీన్ రాజేశ్వరి, ఉపాధ్యాయులు అభినందించారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us