NEET PG: ‘ఈడబ్ల్యూఎస్‌ కోటా నిబంధనల్లోఈ ఏడాది మార్పుల్లేవు’

సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : నీట్‌-పీజీ పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS‌)లకు రిజర్వేషన్లు కల్పించిన విషయమై దాఖలైన దావా విచారణ జనవరి ఆరో తేదీన జరగాల్సి ఉంది. ఈ తరుణంలో కేంద్రం సుప్రీంకోర్టులో ఓ ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఈ విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్‌ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగానే ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధనల్ని మార్చడం వల్ల తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది సవరణలు చేస్తామని తెలిపింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us