పవన్‌ కల్యాణ్‌ కొడుకు పేరు ఏంటో తెలుసా?

UPDATED 2nd NOVEMBER 2017 THURSDAY 11:30 AM

టాలీవుడ్‌ స్థార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి సంబంధించి ఏ వార్త బయటకు వచ్చిన అది వైరల్ అయి కూర్చుంటుంది . ఇటీవల పవన్ భార్య అన్నా లెజినోవా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బాబుకు ‘మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ కొణిదెల’ అని పేరు పెట్టారు. పవన్‌ తన కొడుక్కి ఈ పేరు పెట్టడం వెనుక ఒక స్మాల్ స్టోరీయే ఉందట. భార్య అన్నా లెజినోవా ఆలోచనలు, మత సంప్రదాయాలకు విలువ ఇచ్చి పవన్‌ వారి బిడ్డకు ఈ పేరు పెట్టాడట. ఆమె రష్యన్‌ ఆర్థోడక్స్‌ మత సంప్రదాయాలను పాటిస్తారు. దానికి అనుగుణంగానే పవన్‌ తన బిడ్డకు పేరు పెట్టారు. క్రైస్తవ మతంలో బాగా ప్రాచుర్యం పేరు ‘మార్క్‌’. మార్కస్‌ అనే దేవుడికి సంక్షిప్త నామంగా చెప్పొచ్చు. చిరంజీవి అసలు పేరు శివశంకర్‌ వరప్రసాద్‌ నుంచి ‘శంకర్‌’ను తీసుకొన్నారు. పవన్‌ పేరును పవనోవిచ్‌ అని మార్చి... పూర్తిగా ‘మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌’ అని పెట్టారు. పవన్‌ కల్యాణ్‌, అన్నా లెజినోవాకు పుట్టిన కూతురు పేరు పొలెనా అని మాత్రమే తెలుసు. ఆమె పూర్తి పేరు పొలెనా అంజనా పవనోవా అంట. ఈ పేరు కూర్పు వెనుక కూడా ఆసక్తికరమైన విషయం ఉంది. తన తల్లి అంజనాదేవి నుంచి ‘అంజన’ను తీసుకొని.. తన పేరులోని పవన్‌ను పవనోవాగా మార్చి ‘పొలెనా అంజనా పవనోవా’ అని పెట్టారు. నటనలోనే కాదు తన పిల్లల పేరల్లో పవన్ చూపించిన వైవిధ్యం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే రేణూ దేశాయ్, పవన్ లకి జన్మించిన పిల్లలకి అకీరా, ఆద్య అని పేర్లు పెట్టిన విషయం తెలిసిందే!
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us