UPDATED 4th APRIL 2022 MONDAY 5:00 PM
Kakinada District Collector Doctor Kruthika Shukla : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు.జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన కాకినాడ జిల్లా తొలి కలెక్టర్‌గా కృతికా శుక్లా సోమవారం ఉదయం అధికారికంగా భాద్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాకినాడ జిల్లాకు తొలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలయ్యేలా చూస్తూ పేదల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నవరత్నాలు, ఓటీఎస్, ధాన్యం కొనుగోలు తదితర ప్రాధాన్య అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తొలుత క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో తక్కువ మండలాలు ఉన్నందున గ్రామ సచివాలయ స్థాయి వరకూ సందర్శించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు వీలవుతుందన్నారు. మహిళా అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ విప్పర్తి వేణు గోపాలరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ద్వారంపూడి భాస్కరరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) కె. శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఛైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ తదితరులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.