లక్ష్మీగణపతి సన్నిధిలో ఉపముఖ్యమంత్రి పూజలు

UPDATED 16th SEPTEMBER 2018 SUNDAY 7:00 PM

పెద్దాపురం: పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో రాఘవమ్మ చెరువు గట్టుపై వేంచేసిఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, ఏఎంసీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి) ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.అనంతరం స్వామివారి తీర్థ  ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనె రామారావు, ఎంపీటీసీ సభ్యుడు కల్లూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us