Janasena Janavani : ప్రభుత్వాన్ని నిలదీసేలా.. జనసేన కొత్త కార్యక్రమం జనవాణి

UPDATED 28th JUNE 2022 TUESDAY 06:50 PM

Janasena Janavani : ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసేలా, సామాన్యుడి గళం వినపడేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన పార్టీ. జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలిపేలా జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనసేనాని స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపనున్నారు. జనసేన కార్యాలయం నుంచి అర్జీలను ఫాలోప్ చేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రతీ ఆదివారం జనవాణి కార్యక్రమం ఉంటుందన్నారు.

తొలి రెండు ఆదివారాలు జనవాణి కార్యక్రమాలు విజయవాడలోనే జరుగుతాయన్నారు. ”ప్రజల సమస్యలను ఆసాంతం విని ప్రభుత్వానికి బలంగా తెలిపేలా జన వాణి కార్యక్రమం ఉంటుంది. బాధిత పక్షాల నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరిస్తారు. కష్టాల్లో ఉన్న జన సామాన్యానికి జనసేన భరోసా ఇస్తుంది. జూలై 3న విజయవాడలో ‘జన వాణి’కి శ్రీకారం చుట్టబోతున్నాం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us