TS News : రాష్ట్రాల హక్కుల్ని హరించేలా కేంద్రం ప్రతిపాదనలు : కేసీఆర్

Updated 24 January 2022 Monday 19:00 PM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) : కేంద్రం ప్రతిపాదించిన ఐఏఎస్ నిబంధనల సవరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం తెలిపారు. తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ ఐఏఎస్ అధికారినైనా డిప్యూటేషన్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. దీని పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సవరణలను పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ అంశం పై ప్రధానికి ఇప్పటికే లేఖలు రాశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us