బాల్యానికి దిశానిర్దేశం చేసేది ఉపాధ్యాయులే

UPDATED 5th SEPTEMBER 2018 WEDNEDAY 6:00 PM

సామర్లకోట: బాల్యానికి దిశానిర్దేశం చేసేది ఉపాధ్యాయులే అని మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో దివంగత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ మంచి పనులకు పునాది క్రమశిక్షణని, అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుందన్నారు. శిలను శిల్పంగా మలచినా, బండరాయిని పూజకు అనువుగా తీర్చిదిద్దినా దాని వెనుక విద్య నేర్పిన ఉపాధ్యాయుల కృషి దాగుంటుందని, విద్యార్థుల ఆసక్తిని సునిశితంగా గమనించినప్పుడే ఇది సాధ్యమవుతుందని అన్నారు. అరిస్టాటిల్‌ గుర్తించకపోతే అలెగ్జాండర్‌, చాణక్యుడు గమనించకపోతే చంద్రగుప్తుడు వంటి వీరులు బయటకు వచ్చేవారు కాదని చరిత్రకారులు చెప్పిన మాటలు అక్షర సత్యాలని అన్నారు. భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు సృజనాత్మకత కీలకమని, విద్యాబోధన సమయంలోనే ఉపాధ్యాయులు ఆ సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రయత్నించాలన్నారు. అనంతరం రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాయిరామకృష్ణను ఉపాధ్యాయులు పూలమాలలు, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ఉత్సాహంగా కేక్ కట్ చేసి తమ గురువుల యెడల భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయమ అధ్యాపకుడు తాళ్లూరి వైకుంఠం, ఉపాధ్యాయులు జి. గోవిందు, కె. అరుణ, ఏ.ఎల్.వి. కుమారి, కె.వి.వి. సత్యనారాయణ, రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us