ప్రభుత్వ పథకాల అమలులో స్థానిక సంస్థల పాత్ర కీలకం

UPDATED 16th APRIL 2018 MONDAY 9:00 PM

కాకినాడ: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందించడానికి స్థానిక సంస్థలు ఎనలేని పాత్ర పోషిస్తున్నాయని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ శతవసంతాల వేడుకల పోస్టర్లు, కరపత్రాలను చైర్మన్ ఛాంబర్లో   సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలకు ఎనలేని ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉందని, ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసి వాటి ద్వారా ఆ ఫలాలను ప్రజలకు అవినీతి లేకుండా సజావుగా అందించుటకు కృషి చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్ సమన్వయం చేస్తూ గ్రాస్ రూట్లో ఉన్న గ్రామ పంచాయతీలలో అక్రమాలు జరుగకుండా వాటిని జిల్లా ప్రజా పరిషత్ చర్చించే వేదికన్నారు. 1917లో తూర్పుగోదావరి జిల్లా పరిషత్ గా ఏర్పడి, అనంతరం జిల్లా ప్రజా పరిషత్ గా మార్పు చేయడం జరిగిందిందన్నారు. ఈ జిల్లా ప్రజా పరిషత్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున శత వసంతాల వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్, ఆర్థిక, హోం శాఖా మంత్రులు, రాష్ట్రంలో ఏఎల్ ఏలు జిల్లా పరిషత్ అధ్యక్షులు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 1917 నుండి ఇప్పటి వరకు అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసి, రాజకీయ ప్రహసనం ప్రారంభించారని, వారికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఉపాధ్యాయులే విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందిస్తున్నందున ఉపాధ్యాయులు పురుషులు, మహిళలకు వేరు వేరుగా క్రీడలు నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రజా పరిషత్, మండల పరిషత్లలో పనిచేసే ఉపాధ్యాయులందరూ అర్హులేనని అన్నారు. 17వ తేదీన అన్ని మండలాలలో శత వసంతాల వేడుకల జండాను ఎగురవేస్తారన్నారు. ఉపాధ్యాయులకు ఉపన్యాస పోటీలు ఈ నెల 21వ తేదీన మండల స్థాయిలో మహిళలు, పురుషులు నిర్వహించి, 1,2,3 స్థానాల్లో ఎంపికైన వారిని డివిజన్ స్థాయికి ఎంపిక చేస్తారన్నారు, 22వ తేదీన డివిజన్ స్థాయిలో 1,2,3 స్థానాలు గెలుపొందిన వారికి జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మధ్య స్థానిక సంస్థల బలోపేతంపై ఉపన్యాస పోటీలు ఉంటాయని, వీటిలో జెడ్పిటిసిలు, ఎంపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ ల మధ్య పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో 1,2,3 స్థానాల్లో గెలుపొందిన వారికి పురుషులు, మహిళలకు వేరు వేరుగా మే 4 వ తేదీన డివిజన్ స్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. ఈ నెల 30వ తేదీన జిల్లా, మండల కేంద్రాలలో మహిళా జెడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్ ల మధ్య స్థానిక సంస్థల్లో మహిళల పాత్ర అనే అంశంపై ఉపన్యాస పోటీలు ఉంటాయని, అందులో గెలుపొందిన వారిని డివిజన్ స్థాయికి ఎంపిక చేస్తారని, వారికి మే 2వ తేదీన పోటీలు జరుగుతోందన్నారు. జిల్లా ప్రజలకు అంకితం చేయడానికి నైలాన్ రూపల్పన జిల్లా పరిషత్ చైర్మన్ చేసారని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు కాంస్య విగ్రహాన్ని జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us