Srisailam Trust Board : ప్రమాణ స్వీకారం చేసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు

UPDATED 25th MARCH 2022 FRIDAY 09:20 AM

Srisailam Trust Board : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్ధానం పాలక మండలి (Srisailam Trust Board) ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉదయం 5 గంటలకు జరిగింది. దేవస్ధానం పాలక మండలి సభ్యుల ఎంపిక ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించేందుకు జీఓ విడుదల చేసింది.

దీంతో హుటాహుటిన ఈరోజు తెల్లవారు ఝూమున నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా రెడ్డి వారి చక్రపాణితో సహా 15 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్ధానం పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో 15 మంది నూతన పాలకమండలి సభ్యలతో ఈఓ లవన్న ప్రమాణం చేయించారు. ముఖ్య అతిధులుగా తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి హాజరయ్యారు.

వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రమాణస్వీకారం చేయాల్సివుండగా హైకోర్టు ఆదేశాలతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. దేవాలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ప్రమాణస్వీకారంపై న్యాయస్థానం స్టే విధించింది. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకాన్ని..ప్రభుత్వం జారీ చేసిన జీవో 84ను సవాలు చేస్తూ.. కర్నూలు జిల్లా గుగుంజాయ్ తండాకు కొర్రా శ్రీనివాసులు నాయక్ అనే గిరిజన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.

దేవాలయ పాలకమండలిలో గిరిజనులకు ప్రాతిధ్యం లేదని… ప్రభుత్వం నిబంధనలను పాటించకుండానే బోర్డ్ సభ్యులను నియమించిందని స్థానిక గిరిజనుడైన శ్రీనివాసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.గిరిజన నేపథ్యం కలిగిన ఆలయ పాలకమండలిలో వారికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం…నిబంధనల ప్రకారం పాలకమండలిలో ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవెత్తలకు చోటు కల్పించటంవంటివి లేవని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. అలాగే ఎస్టీ సభ్యునికి రిజర్వేషన్ అమలు చేయలేదని పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన విన్న హైకోర్టు ప్రమాణస్వీకారం జరపకుండా వాయిదా వేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల వరకు ప్రమాణస్వీకారం చేయించవద్దని ఆదేశించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us