ఆదిత్య ఫార్మసీ విద్యార్థులచే ఉచిత వైద్య శిబిరం

UPDATED 3rd MARCH 2018 SATURDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నాల్గవ సంవత్సరం చదువుతున్న ఫార్మా-డి విద్యార్థులు సూరంపాలెం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కుంచే రాజా ప్రారంభించి మాట్లాడారు. స్వచ్చంధ సంస్థలు, కళాశాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో ఉచితంగా రక్తపోటు, చక్కెరవ్యాధి, హెపటైటిస్, బ్లడ్ గ్రూపింగ్, బి.ఎం.ఐ. పరీక్షలు నిర్వహించి, సుమారు 400 మంది గ్రామస్థులకు అవసరమైన 50 రకాల మందులు పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు, తల్లి పాలు ప్రాముఖ్యత, పోషకాహారం, పరిసరాల పరిశుభ్రత, ప్రథమ చికిత్స, పిల్లలకు టీకాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జి.ఎస్.ఎల్.హాస్పిటల్ వైద్య బృందం డాక్టర్ పి. సరోజినీ నాయుడు, డాక్టర్ పి.పృధ్వి, డాక్టర్ పి.అనిల్, ఆదిత్య అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us