మన్మథుడు @ 15

UPDATED 20th DECEMBER 2017 WEDNESDAY 6:00 PM

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునని అభిమానులు టాలీవుడ్ మన్మథుడు అంటూ ముద్దుగా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. 2002, డిసెంబర్ 20న విడుదలైన మన్మధుడు చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ చిత్రంలో నాగ్ ఎంతో స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా కనిపించాడు. దీంతో అప్పటి నుండి నాగ్ కి టాలీవుడ్ మన్మథుడు అని పిలుచుకుంటారు. కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో మన్మథుడు మూవీలో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మరియు మాటలు అందించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. నేటితో ఈ చిత్రం15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా నాగ్ ఫ్యాన్స్ మన్మథుడు చిత్రాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగ్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ్ తన తనయుడు అఖిల్ తాజా చిత్రం హలో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత వర్మ మూవీలో పోలీస్ స్టోరీ నేపథ్యంలో సినిమా చేయనున్నాడు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us