అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: అనాలోచిత నిర్ణయాలతో జగన్రెడ్డి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. మంగళవారం అనిత మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ తీవ్రత సమయంలో మద్యం విక్రయాల సమయం పొడిగించడమేంటి? అని ప్రశ్నించారు.మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా? అని నిలదీశారు.ప్రభుత్వ మూర్ఘపు నిర్ణయాలతో మహిళలపై గృహహింస , హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు.టార్గెట్లు పెట్టి మరీ మద్యం ఆదాయం పెంచుకోవడమేనా దశలవారీ మద్యపాన నిషేధమంటే? అని ప్రశ్నించారు.మద్యం విక్రయాల సమయం పొడిగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.