29న అల్పపీడనం..?

అమరావతి (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: దక్షిణ అండమాన్‌ సముద్రంలో 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది. మరోవైపు శ్రీలంక తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో... రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం నుంచి రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని సూచించారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో... ‘‘తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. డిసెంబరు 1వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు. లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి’’ అని హెచ్చరించారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us