సత్యదేవుని దర్శించుకున్న శాసన మండలి పిటీషన్ల కమిటీ

UPDATED 17th JULY 2018 TUESDAY 9:00 PM

అన్నవరం: ప్రజాస్వామ్యంలో అందరికి సమస్యలు ఉంటాయని వాటిని చర్చించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్, పిటీషన్ల కమిటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్ర శాసన మండలి పిటీషన్ల కమిటీ అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయస్వామి వారిని మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్, పిటీషన్ల కమిటీ చైర్మన్ విలేఖర్లతో మాట్లాడుతూ సమస్యలను చట్టసభలు, అసెంబ్లీ, రాజ్యసభ, కౌన్సిల్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలు విస్తృతంగా చర్చించి పరిష్కరించే వేదిక పిటీషన్ల కమిటీదని అన్నారు. పిటీషన్ కమిటీ చైర్మన్ గా రెడ్డి సుబ్రహ్మణ్యం, సభ్యులు ఎంఎల్సీలు బచ్చుల అర్జునుడు, మంతెన వెంకట సత్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర రెడ్డి ఉన్నారని తెలిపారు. గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల వేతనాలపై వచ్చిన పిటీషన్ పరిష్కరించే నిమిత్తం కాకినాడలో చర్చించడం జరిగిందని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతామన్నారు. అలాగే విశాఖపట్నంలో ఆరు అర్జీలు, కొన్ని జనరల్ పిటీషన్లు ఉన్నాయని, వాటిని కూడ చర్చించడానికి విశాఖపట్నం వెళుతున్నట్లు ఆయన తెలిపారు. వీరికి ముందుగా అన్నవరం దేవస్థానం ఇవో జితేంద్ర, పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, దేవస్థానం పిఆర్వో తులా రాముడు పూర్ణకుంభంతో, వేదమంత్రాలతో, మంగళవాయిద్యాలతో కమిటీకి స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఇవో స్వామివారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో శంఖవరం తహసీల్దార్ సుజాత, ఆర్ఐ భాస్కర ప్రసాద్, దేవస్థానం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us