జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ బదిలీ

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021: జిల్లా జాయింట్ కలెక్టర్‌ (రెవెన్యూ- రైతు భరోసా) డాక్టర్‌ జి.లక్ష్మీశ బదిలీ అయ్యారు. ఈయన్ను మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరికి ప్రభుత్వం అప్పగించింది. లక్ష్మీశ 2019 జూన్‌ 28న జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల మూడు నెలల 25 రోజుల పాటు జిల్లాలో పనిచేసిన ఈయన సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు. ఇళ్ల స్థల పట్టాల పంపిణీలో భాగంగా జిల్లాలో 3వేల ఎకరాల భూసేకరణలో కీలకంగా వ్యవహరించారు. 3.30 లక్షల మందికి పట్టాల పంపిణీ చేపట్టారు. భూముల రీసర్వే, దస్త్రాల నవీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us