ఒక్క క్షణం....

UPDATED 4th DECEMBER 2017 MONDAY 6:00 PM

అల్లు శిరీష్, సురభి, సీరత్‌కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఒక్క క్షణం. వీఐ ఆనంద్ దర్శకుడు. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను నిన్న హైదరాబాద్‌లో అల్లు శిరీష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థ్రిల్లర్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా  సాగే సైన్స్ ఫిక్షన్ చిత్రమని, ఇంతవరకు తెలుగు తెరపై రానటువంటి వినూత్న కథ అన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఆపదలో చిక్కుకున్న తన ప్రేయసిని కాపాడుకోవడానికి ఓ యువకుడు చేసిన ప్రయత్నాలేమిటన్నదే చిత్ర కథాంశం. ప్రేమకు, విధికి మధ్య పోరాటాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరిస్తుంది. పారలల్‌లైఫ్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందించడం జరిగిందని దర్శకుడు చెప్పారు. గొప్ప కథలో భాగమవడం ఆనందంగా ఉందని సురభి పేర్కొంది. గ్లామర్ ప్రధాన పాత్రను చేస్తున్నానని సీరత్‌కపూర్ తెలిపింది. దర్శకుడు వీఐ ఆనంద్‌తో తనకిది మూడో చిత్రమని, స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుందని అబ్బూరి రవి చెప్పారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us