గ్రామదర్శినిలో సమస్యలు వెల్లువ

* సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం 
* ఎంఇవో, సిడిపివో, పంచాయతీ సెక్రటరీ, ఆర్.డబ్యు.ఎస్ జెఇ, ఎలక్ట్రికల్ ఎఇ లపై కలెక్టర్ ఫైర్ 
* ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ సీరియస్ 
* తీరుమార్చుకోకుంటే చర్యలు తప్పదని హెచ్చరిక

UPDATED 28th SEPTEMBER 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి:.ప్రజా సమస్యల పరిష్కారానికి  గ్రామదర్శిని కార్యక్రమం దోహదపడుతుందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన  గ్రామదర్శిని కార్యక్రమానికి జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు నెహ్రూ  మాట్లాడుతూ జిల్లా కలెక్టరు గండేపల్లి వచ్చి ప్రభుత్వ పథకాలు అందించడంలో సమస్యలు ఉంటే తెలుసుకుని వాటిని సంబంధిత అధికారులు ద్వారా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. గండేపల్లి మండలంలో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు లేక రైతులు బోర్లుమీద ఆధారపడి సాగు చేసుకుంటున్నారని, ఈ సమస్యను పుష్కర ఎత్తిపోతల అధికారలతో సమీక్షించి పరిష్కారం చూడాలని ఎమ్మెల్యే కలెక్టరు దృష్టికి తెచ్చారు. అలాగే మండలంలో డ్రైనేజి, సిసి రోడ్లు ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కరంటు సమస్య ఉందని, అలాగే కరెంటు బిల్లులు విషయంలో వ్యత్యాసాలు వస్తున్నాయని, కరెంటు పోయినపుడు ఎలక్ట్రికల్ సిబ్బంది వెంటనే స్పందించడం లేదని కలెక్టరు దృష్టికి ప్రజలు తెచ్చారు. దీనిపై కలెక్టరు ఎలక్ట్రికల్ ఎఇ కుమారరాజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెల రోజుల్లో సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, పారిశుద్యం సరిగా లేదని, అలాగే త్రాగునీరు శుద్ద నీరు వస్తోందని, డ్రైనేజీలు లేక ఎక్కడబడితే అక్కడ నీరు నిల్వ ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. నెల రోజుల్లోగా ఈ సమస్యలను పరిష్కరించి సదరు ఫిర్యాదు చేసిన వారి నుంచి సమస్య పూర్తి అయినట్లు సర్టిఫికెటు తేవాలని ఎంఇవో, సిడిపివో, పంచాయతీ సెక్రటరీ, ఆర్.డబ్యు.ఎస్. జెఇలను ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శాసన సభ్యులు జ్యోతుల నెహ్రుతో కలిసి జిల్లా కలెక్టరు పంపిణీ చేశారు. అలాగే కలెక్టరు, ఎంఎల్ఏతో కలిసి గండేపల్లి పిహెచ్.సి సెంటర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఆర్.జి.ఎస్ పిడి రాజకుమారి, జెడ్పీటీసి వై. వెంకటలక్ష్మి, జగ్గంపేట ఏఎంసి చైర్మన్ ఎస్.వి.ఎస్. అప్పలరాజు, పౌర సరఫరాల డైరెక్టర్ కందుల కొండయ్యదొర, కోర్పు లచ్చయ్యదొర, ఎంపిడివో రమేష్, తహసీల్దార్ గీతాంజలి, ఎంఇవో నాయిక్, వివిధ శాఖల అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
 

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us