పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

UPDATED 9th JUNE 2019 SUNDAY 8:00 PM

పెద్దాపురం: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో అవగాహన ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలో ర్యాలీ నిర్వహించి నీటిని సంరక్షిద్దాం... కరువును తరిమికొడదాం అంటూ నినాదాలు చేసి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల చిన్నారులకు పర్యావరణ మార్పులు గురించి అవగాహన కల్పించి వారిచే బొమ్మలు వేయించారు. ఈ సందర్భంగా ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యతగా గుర్తించి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. పచ్చదనం కోసం మొక్కలను నాటడం, నీటిని పొదుపుగా వాడడం, భూగర్భ జలాలను పెంచేందుకు ఇంటికో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పర్యావరణం ప్రకృతి ప్రసాదించిన వరమని, పర్యావరణ కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోందని, పెరుగుతున్న కాలుష్యం మూలంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ ఎస్ఎస్ఎస్ పీవో ప్రవీణ్, గోవర్ధనరెడ్డిలను అభినందిస్తూ తమ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై మరిన్ని కార్యక్రమాలు చేసి తద్వారా ప్రజలలో మార్పు తీసుకురావాలని కోరారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us