Ram Mohan Naidu : మీరు రాజీనామా చేస్తే మేమూ రెడీ.. వైసీపీ ఎంపీలకు టీడీపీ సవాల్

UPDATED 14th FEBRUARY 2022 MONDAY 07:20 PM

అమరావతి: ప్రత్యేక హోదా అంశం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండాలో తొలుత ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చిన కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత అజెండా నుంచి తొలగించడం దుమారం రేపుతోంది. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. అజెండా నుంచి స్పెషల్ స్టేటస్ అంశాన్ని తొలగించడం వెనుక టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబుని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీలో ఉన్న తన మనుషులతో చెప్పించి ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి తొలగించారని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీని ఉద్దేశించి అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us