PM Modi: చిరస్మరణీయ కార్యక్రమ విశేషాలను మీతో పంచుకుంటున్నా..! ట్విటర్‌లో వీడియో పోస్టు చేసిన మోదీ

UPDATED 5th JULY 2022 TUESDAY 07:30 PM

PM Modi: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని అల్లూరి 30అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలోని పలు విశేషాలతో కూడిన ఫోటోలను వీడియో రూపంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.‘వీర అల్లూరి సీతారామ రాజు గారికి నివాళులర్పించిన ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరంలో నిన్న జరిగిన చిరస్మరణీయ కార్యక్రమ విశేషాలను మీతో పంచుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us