గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి

* ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
* ఉలిమేశ్వరంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన

UPDATED 9th OCTOBER 2018 TUESDAY 5:00 PM

పెద్దాపురం: గ్రామాలు అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామాలను అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మండలంలోని ఉలిమేశ్వరం గ్రామంలో మంత్రి మంగళవారం పర్యటించి ప్రతీ ఒక్కరిని కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి కేంద్రం నిర్వహణ, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏబిసిడిల మొదటి బరిని చిన్నారులు మంత్రికి చదివి వినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన   గ్రామసభలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ డిసెంబరు నెలాఖరునాటికి గ్రామంలో పెండింగులో ఉన్న ఎస్సీ  పేటలో మహిళాభవనం, కళ్యాణమండపం, కనకదుర్గ ఆలయం వద్ద కాపు కళ్యాణ మండపం, సిసిరోడ్లు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. గ్రామంలో నూతనంగా గృహాలు నిర్మించుకునేందుకు ఒసిలకు రూ. ఒక లక్షా 50 వేలు, ఎస్సీ వర్గాలకు రూ. రెండు లక్షలు ఇళ్ళు నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందచేస్తుందని చెప్పారు. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేశామని, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వపరంగా బకాయిఉన్న రూ. రెండు వేలు విజయదశమికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం చంద్రన్నభీమా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని, నిరుపేదలకు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచితంగా వైద్యపరీక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం, ఒంటరి మహిళలకు పింఛన్లు అందచేస్తున్నామని చెప్పారు. గత నాలుగు  సంవత్సరాల్లో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి సుందరపల్లి శివనాగరాజు, ఎంపిపి గుడాల రమేష్, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఎంపిటిసి పేకేటి వెంకటేశ్వరరావు (దొరబాబు), గుడా డైరెక్టర్ ఎలిశెట్టినాని, అన్నవరం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, కమ్మిల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

  

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us