త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో మళ్ళీ రిపీట్

రెడ్ బీ న్యూస్ 28 ఆక్టోబర్ 2021: త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందని తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన గత చిత్రం అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజిక్ కూడా పెద్ద సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో చినబాబు నిర్మించారు. అలాంటి కాంబోలో మళ్ళీ సినిమా అంటే అందరిలోనూ ఉండే ఆ అంచనాలు వేరే లెవల్. త్వరలో ఇదే కాంబినేషన్‌లో మళ్ళీ ఓ భారీ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రానుందని టీమ్ వెల్లడించింది. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కలిసి ఉన్న ఓ పిక్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. దీని ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ 17న 5 భాషలలో రిలీజ్ కానుంది. రష్మిక మందన హీరోయిన్.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us