పరిపాలన సౌలభ్యం కోసం నూతన భవనాల నిర్మాణం

UPDATED 10th MARCH 2018 SATURDAY 7:30 PM

పెద్దాపురం: పరిపాలనా సౌలభ్యాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు నూతన ప్రభుత్వ భవనాలను నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశ్యమని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. మల్లిఖార్జున, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, జగ్గంపేట, ప్రత్తిపాడు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, డిసిసిబి చైర్మన్ వరుపుల రాజాతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో శిథిలావస్థలో ఉన్న పాత కార్యాలయాలను తొలగించి వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని ఎక్కువమంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి సంబంధిత స్థలాన్ని ఆర్&బి ఎస్ఈ సి.ఎస్.ఎన్ మూర్తి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆర్డీవో కార్యాలయం బలహీనపడి శిథిలావస్థకు చేరుకుందని, దాని స్థానంలో నూతన భవనం నిర్మాణానికి రూ. 2.25 కోట్లు ఖర్చుతో ఆర్డీవో కార్యాలయం, రూ. 95 లక్షల వ్యయంతో తహసిల్దార్ కార్యాలయం నిర్మించడం జరుగుతుందని, అందుకు సంబంధించి నిధులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే నూతన భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొరిపూరి రాజు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గన్నంరాజు సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పైడిపల్లి సూర్యనారాయణ మూర్తి (చిన్ని), ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఆత్మా  చైర్మన్ కలకపల్లి రాంబాబు, అన్నవరం ధర్మకర్తల మండలి సభ్యులు కందుల విశ్వేశ్వరరావు, పర్వత రాజుబాబు, లలితా ఇండస్ట్రీస్ ఎండి మట్టే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us