Thirupathi: కమనీయం.. శివపార్వతుల కల్యాణం

UPDATED 3rdnd MARCH 2022 THURSDAY 07:00 AM

Thirupathi: తిరుపతి కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారు జామున 12 నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. వివిధ పూజల అనంతరం పురుషామృగ వాహనంపై సోమస్కంధమూర్తి భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు.

7 నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుచ్చిపై స్వామికి ఆస్థానం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపీనాథజెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఏఈవో సత్రేనాయక్‌, సూపరింటెండెంట్‌ భూపతి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రెడ్డిశేఖర్‌, అర్చకులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us