'ఉయ్యాలవాడ'... మొదలైంది

UPDATED 17th AUGUST 2017 THURSDAY 10:00 PM

పదేళ్ల విరామం అనంతరం ఖైదీనంబర్ 150 చిత్రంతో చిరంజీవి మరోసారి హీరోగా  ప్రేక్షకులముందుకొచ్చారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఆయన తన 151వ చిత్రానికి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథాంశాన్ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ సినిమా బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. చిరంజీవి దంపతులతో పాటు రామ్‌చరణ్, చిత్ర దర్శకుడు సురేందర్‌రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్క్రిప్ట్‌ని దర్శకుడికి నిర్మాత అల్లు అరవింద్, పరుచూరి బ్రదర్స్ సంయుక్తంగా అందజేశారు. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. చారిత్రక వీరుడిగా చిరంజీవి పాత్ర చిత్రణ భిన్న పార్వాల్లో సాగనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us