టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం

జగ్గంపేట, 4 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): టీడీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రజలు, కార్యకర్తల సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని పలువురు టీడీపీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల నూతనంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికయిన జ్యోతుల నవీన్ స్వగృహంలో ఆదివారం జిల్లా టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. భవిష్యత్తులో టీడీపీ పటిష్ఠతకు చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా అహర్నిశలూ శ్రమించాలన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సీనియర్ టీడీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ క్యాడర్ ఎక్కడా చెక్కుచెదరలేదని వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా టీడీపీ పునాదులను కదిలింలేరన్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్ల అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానన్నారు. పార్టీకి పూర్వ వైభవం తధ్యమని, అందరి సహకారంతో ముందుకు సాగుతానన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు వన మాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, ఎస్.ఎస్.వర్మ, యనమల కృష్ణుడు, పెందుర్తి వెంకటేష్, అయితాబత్తుల ఆనందరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మేయర్ సుంకర పావని తదితరులు పాల్గొన్నారు
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us