సచివాలయ పరీక్షలు నిర్వహణకు చర్యలు

* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

UPDATED 19th AUGUST 2020 WEDNESDAY 6:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లా కలెక్టర్లతో  రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల సెప్టెంబరు 20 నుంచి 26 తేదీ వరకు నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల నిమిత్తం  జిల్లాలో 1,338 పోస్టులకు గాను ఒక లక్షా 11 వేల 518 ధరఖాస్తులు వచ్చాయని, వీటి కోసం 437 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ఈ పరీక్షలకు సంబంధించి మొదటి రోజు ఉదయం అత్యధిక సంఖ్యలో 51 వేల 198 మంది, మధ్యాహ్నం 22,149 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని అన్నారు. కోవిడ్-19 దృష్ట్యా అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ, ప్రతీ పరీక్ష గదిని పూర్తిగా శానిటేషన్ చేయించడం, ఇన్విజిలేటర్లకు రెండు రోజులు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎస్పీ అద్నాన్ నయిం అస్మీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సిఈవో ఎం. జ్యోతి, డిపివో నాగేశ్వర నాయక్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us