CM Jagan: కార్పొరేట్ స్కూల్స్ నుంచే టెన్త్ పేపర్ లీక్.. జగన్‌కు మంచిపేరు రాకూడదనే..

UPDATED 5th MAY 2022 MAY WEDNESDAY 02:00 PM

AP CM Jagan: అన్నివర్గాల ప్రజలు బాగుండాలని వైసీపీ ప్రభుత్వంలో మంచి పథకాలు అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మనకు మంచిపేరు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి పర్యటన సందర్భంగా తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యా దీవెన నగదు జమ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే చంద్రబాబు సహించలేరని, ప్రజలకు మంచి చేస్తుంటే దుష్ట చతుష్టయానికి కడుపు మంట అంటూ జగన్ విమర్శించారు. వాళ్లు గుడులను ధ్వంసం చేస్తే మనం బాగు చేయించామని, వాళ్లు విగ్రహాలు విరిచేస్తే.. మనం ప్రతిష్టించామని, వాళ్లు రథాలు తగలబెడితే మనం కొత్తవి చేయించామని, వాళ్లు మన పిల్లలు భవిష్యత్తు, పల్లెలను దెబ్బతీస్తే.. మనం కొత్త జీవం పోశామని జగన్ అన్నారు.

ఎన్నికలు వచ్చే సరికి వాళ్ల మాటలు కోటలు దుటుతాయని, ఎన్నికల కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారంటూ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం పనితీరు, మా ప్రభుత్వం పనితీరును పోల్చి చూడాలని ప్రజలను కోరుతున్నానని జగన్ అన్నారు. వైసీపీ హయాంలో గొప్ప మార్పులు, సంస్కరణలు చేస్తుంటే ఆ దొంగల ముఠాకు బీపీ పెరుగుతోందని జగన్ విమర్శించారు. పదవ తరగతి పేపర్ లీక్ అంటూ, ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్ష పార్టీ ప్రచారం చేస్తుందని, పేపర్ లీక్ చేసింది టీడీపీ నేతలే అంటూ జగన్ ఘాటుగా విమర్శించారు.

కార్పొరేట్ స్కూల్స్ పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకు అవుతున్నాయని, జగన్ కు మంచిపేరు రాకూడదనే ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నారనంటూ జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చిందని, పాదయాత్రలో ఎన్నో కష్టాలను కళ్లారా చూశా. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయకూడదనుకున్నా. అందుకే.. విద్యార్థులకు లబ్ధి చేకూరే పథకాలతో గొప్ప విప్లవం తీసుకొచ్చామంటూ సీఎం జగన్‌ అన్నారు. విద్యాదీవెన అనేది రాష్ట్రంలోనే గొప్ప పథకం అని, అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్‌లోనే డబ్బులు జమ చేస్తున్నామని జగన్ తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us