టీమ్ ఇండియా కొత్త జెర్సీ ఇదే

UPDATED 5TH MAY 2017 FRIDAY 3:30 PM

ముంబై: భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ గురువారం ఆవిష్కరించాడు. నీలం రంగుతో ఉన్న ఈ జెర్సీ ముందు భాగంలో టీమ్ అధికారిక స్పాన్సర్ ఒప్పో పేరును ముద్రించారు. మొబైల్ ఫోన్ కంపెనీకి చెందిన చైనీస్ అధికారులు కొంత మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంగ్లండ్‌లో జూన్ 1 నుంచి మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఇదే జెర్సీతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. భారత్ ప్రపంచ నంబర్‌వన్ జట్టు. మాపై ఉన్న నమ్మకాన్ని, క్రికెట్‌పై ఉన్న అంకితభావాన్ని ఒప్పో నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం. క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు మేం కలిపి పని చేస్తాం అని జోహ్రీ పేర్కొన్నాడు. బీసీసీఐతో ఐదేండ్ల కాలానికి స్పాన్సర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పో ఇందుకోసం బోర్డుకు రూ. 1,079 కోట్లు చెల్లిస్తున్నది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us