గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం

UPDATED 13th JANUARY 2018 SATURDAY 5:00 PM

పెద్దాపురం: గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో గోరింట డవలప్మెంట్ యూత్ ఆధ్వర్యంలో ఐదు లక్షలు వ్యయంతో గ్రామం, రహదారికి ఇరువైపులా ఏర్పాటుచేసిన 284 మొక్కల ప్లాంటేషన్ మంత్రి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ యువత సహకారం ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందని, గోరింట డవలప్మెంట్ యూత్ ఆధ్వర్యంలో మొక్కలు, ప్లాంటేషన్ అతి సుందరంగా ఏర్పాటుచేసిన యూత్ సభ్యులను ఆయన అభినందించారు. ప్రభుత్వ పరంగా అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని, మొక్కలకు నీళ్లు పోయడానికి స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ట్రాక్టర్ ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ అంగీకరించారన్నారు. గోరింట డవలప్మెంట్ యూత్ జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన యూత్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో యువత గోరింట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అర్హత గల పేదలకు అందించడంలో యువత పాలుపంచుకోవాలన్నారు. గోరింట డవలప్మెంట్ యూత్ ను అభినందించి గ్రామ యువత కోరిన ప్రకారం ట్రాక్టర్ ఏర్పాటుచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, ఎంపిపి గుడాల రమేష్, గుడా సభ్యుడు ఎలిశెట్టి నాని, గోరింట డవలప్మెంట్ యూత్ అధ్యక్షుడు పచ్చిపాల సతీష్, సీనియర్ టిడిపి నాయకులు పచ్చిపాల సత్తిబాబు, సర్పంచ్ వంగలపూడి వీరయ్యమ్మ, జిల్లా పంచాయతీ అధికారి కుమార్, ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, ఎంపిడివో వసంతమాధవి, ఇంచార్జ్ తహసీల్దార్ కృష్ణారావు, గోరింట డవలప్మెంట్ యూత్ సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు.            

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us